జనవరిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్
NEWS Sep 27,2025 05:05 pm
విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. 2010లో 4జీ, 2020లో 5జీ, 2030లో 6జీ సేవలు వస్తాయని అన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయని పేర్కొన్నారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారని ప్రశంసించారు..మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ జనవరిలో అమరావతికి వస్తుందని చెప్పారు. సేఫ్టీ, సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరమని స్పష్టం చేశారు . ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమన్నారు.
రియల్‌టైమ్ డేటా కోసం ఐవోటీలు వస్తున్నాయన్నారు.