HYD: భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు.