అక్టోబర్ 16న ఏపీకి రానున్న మోదీ : లోకేష్
NEWS Sep 27,2025 12:44 pm
అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని వెల్లడించారు మంత్రి నారా లోకేష్. జీఎస్టీ సంస్కరణల పై కర్నూల్ లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ చేపడతారని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారని, అక్కడి నుంచి నేరుగా శ్రీశైలం లో మల్లన్న దర్శనం చేసుకుంటారని తెలిపారు లోకేష్.