హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సజ్జనార్
NEWS Sep 27,2025 12:23 pm
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు, పోస్టింగ్‌లు చేపట్టింది. 6గురు ఐఏఎస్, 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ను నియమించింది. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని నియమించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.