బంగారం ధర ధగధగ.. వేడెక్కిన వెండి
NEWS Sep 27,2025 12:17 pm
గోల్డ్, సిల్వర్ రేట్స్ పైపైకి ఎగబాకుతున్నాయి. HYDలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹600 పెరిగి ₹1,15,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹550 పెరిగి ₹1,05,850 పలుకుతోంది. ఇక వెండి ఒకేరోజు ₹6వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర ₹1,59,000కు చేరింది. శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనాల్సినవారు ఆందోళన చెందుతుండగా, ఇప్పటికే వాటిపై పెట్టుబడి పెట్టినవారు సంతోషపడుతున్నారు.