₹ 1499 లకే విమాన ప్రయాణం
NEWS Sep 27,2025 12:12 pm
కొత్త సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఎలియన్స్ ఎయిర్ లైన్స్ కేవలం ₹1,499 లకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమండ్రి – తిరుపతి మధ్య ఎలియన్స్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. వచ్చే నెల 1న ఈ సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా టికెట్ ధరను తొలుత ₹1,999 లుగా నిర్ణయించగా.. ప్రస్తుతం దానిని ₹ 1,499 లకు మార్చారు. ఈ ఆఫర్ అక్టోబరు 2, 4, 6 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎలియన్స్ సంస్థ రాజమండ్రి మేనేజర్ తెలిపారు. వారంలో 3 రోజులు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు.