నిరుపేద దళితులకు ఇందిరమ్మ ఇళ్ల
మంజూరుకోసం ఎమ్మెల్యేకు విన్నపం
NEWS Sep 27,2025 12:02 pm
మణుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఎమ్మార్పీఎస్ నాయకులు కలసి, నిరుపేద దళిత కుటుంబాలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 10 మందికి ఇళ్లు కేటాయించాలని వారు కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అర్హులను అధికారులు నిర్ధారించిన వెంటనే తన కోటాలో ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.