కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుక
NEWS Sep 27,2025 11:48 am
మణుగూరులో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న బాపూజీ, జీవితాంతం ఆ విలువలను పాటిస్తూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, మానవతావాది” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిరినాక నవీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.