ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా
NEWS Sep 27,2025 10:27 am
టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 29, 30, 31 (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల నిలిపి వేసినట్లు పేర్కొన్నారు ఈవో సింఘాల్. ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.