పెద్దాపూర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుక
NEWS Sep 27,2025 11:47 am
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఐలమ్మ విగ్రహానికి BJP రాష్ట్ర నాయకులు కంకణాల జ్యోతిబసు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సింహస్వభావ వీరవనిత. తెలంగాణ మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలు” అని తెలిపారు.