దసరా సందర్భంగా TGSRTC లక్కీ డ్రా
NEWS Sep 26,2025 10:52 pm
దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల కోసం TGSRTC లక్కీ డ్రా పథకాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు డీలక్స్, సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారు ఈ డ్రాకు అర్హులు. టికెట్ వెనక పేరు, చిరునామా రాసి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని మంథని డీఎం శ్రావణ్ తెలిపారు. అక్టోబర్ 8న డ్రా నిర్వహించబడుతుంది. మొదటి బహుమతిగా రూ.25,000, రెండో బహుమతి రూ.15,000, మూడో బహుమతి రూ.10,000 ఇవ్వనున్నారు.