వైన్స్ షాపుల రిజర్వేషన్ లాటరీ ద్వారా కేటాయింపు
NEWS Sep 26,2025 10:51 pm
PDPLలోని వైన్స్ షాపుల రిజర్వేషన్ లాటరీ ద్వారా పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జిల్లాలోని 74 ఏ4 షాపుల్లో గౌడ కులస్థులకు 13, ఎస్సీలకు 8 షాపులు కేటాయించగా, మిగిలిన 53 షాపులకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు లైసెన్స్ అమలులో ఉంటుందని, ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు ఉండనుందని వెల్లడించారు.