గర్భిణులు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించాలి
NEWS Sep 26,2025 10:50 pm
PDPL జిల్లాలో గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో నమోదై MCP కార్డు తీసుకోవాలని డిప్యూటీ DMHO శ్రీరాములు సూచించారు. మొదటి 2 పరీక్షలు ఆరోగ్య కేంద్రాల్లో, మిగతావి రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల ద్వారా నిర్వహిస్తారు. పిండం ఎదుగుదల, రక్తహీనత, డెలివరీ జాగ్రత్తలపై నిపుణుల సూచనలు లభిస్తాయి. యువతులు నెలసరి సమస్యలపై శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.