పత్తి కొనుగోలుకు అధికారులు సిద్ధం కావాలి
NEWS Sep 26,2025 10:50 pm
పెద్దపల్లిలో ఖరీఫ్ సీజన్‌లో పత్తి కొనుగోలుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. జిల్లాలో 5 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తేమ 8% ఉన్న పత్తికి రూ.8,110 కనీస మద్దతు ధర లభిస్తుందని వెల్లడించారు. రైతులు నాణ్యమైన పత్తినే కేంద్రాలకు తీసుకురావాలని, మధ్యవర్తుల వద్దకు కాకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.