జనసేనలోకి రాజుగుంట యువ నాయకుల చేరిక
NEWS Sep 26,2025 05:19 pm
చిట్వేలి మండలం రాజుగుంటకు చెందిన యువ నాయకులు ఆనాల సునీల్ కుమార్, మాజీ సర్పంచ్ మాదినేని కనకరాజు, మాదినేని లోకేష్ తమ కుటుంబాలతో కలిసి శుక్రవారం విజయవాడలో జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలు కొనిదెల నాగబాబు, పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ పరిణామంతో మండలంలో జనసేన బలం పెరిగిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.