పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్
NEWS Sep 26,2025 07:11 pm
ప్రముఖ పర్యావరణ యాక్టివిస్ట్ సోనం వాంగ్ చుక్ ను లేహ్ లో శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లడఖ్ కు ప్రత్యేక హోదా కావాలని గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేపడుతున్నారు. నిరసనలు తీవ్రం కావడం, లడఖ్ లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పరిస్తితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలకు ప్రధాన కారకుడు వాంగ్ చుక్ అని కేంద్రం ఆరోపించింది.