నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిశీలన
NEWS Sep 26,2025 07:15 pm
మంత్రి లక్ష్మణ్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పరిశీలించారు. ఫ్యాక్టరీ కింద గతంలో చెరుకు ఎంత సాగు అయ్యేదని ఆరా తీశారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు , అధికారులు వివరాలు అందించారు. ఎంత మంది రైతులు ఆధారపడి ఉన్నారు, ఎందరికి ఉపాధి పొందుతున్నారో వివరాలను అడిగి సేకరించారు.