ప్రపంచబ్యాంక్ కు లేఖ రాసిన ఎమ్మెల్యే
NEWS Sep 26,2025 06:05 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెలయే మదన్ మోహన్ రావు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. వరదలు ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన తమ నియోజకవర్గానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆయన రాసిన లేఖ అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వాన్ని కాదని, సీఎంకు సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన నేరుగా వరల్డ్ బ్యాంకుకు లేఖ రావడం విస్మయం కలిగించింది.