PHCలో బతుకమ్మ సంబరాలు
NEWS Sep 26,2025 06:17 pm
మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి, ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మౌనిక మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆరోగ్యానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక అని, ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయన్నారు.