మల్యాల మండల కేంద్రంలోని మల్యాల చెరువులో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకువెళ్లిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై ఉంచి కన్నుల పండువగా ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో సమితి నిర్వాహకులు, భవానీ దీక్షాపరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.