చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
NEWS Sep 26,2025 05:41 pm
ఇబ్రహీంపట్నం మండలం బర్తిపూర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీరురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. ఐలమ్మ సాధారణ కూలీ మహిళగా ప్రారంభమైనా, అన్యాయం చూసి తిరగబడిన అసాధారణ ధైర్యస్వభావం కలిగిన మహనీయురాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో రజక సంఘం, గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.-