చాకలి ఐలమ్మ పోరాటం మరువలేం: ఎమ్మెల్యే
NEWS Sep 26,2025 05:40 pm
మణుగూరు మండలం హనుమాన్ ఆలయం వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఆమె పోరాట స్ఫూర్తి మహిళలకు ఆదర్శమని అన్నారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సంక్షేమ పథకాలు వారి పేరుమీద అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.