2,620 మద్యం షాపులకి నోటిఫికేషన్ జారీ
NEWS Sep 26,2025 03:34 pm
తెలంగాణలో 2,620 మద్యం షాపులకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. నేటి నుంచి వచ్చే నెల అక్టోబరు 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అక్టోబర్ 23న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా షాపు చేజిక్కించు కునేందుకు సర్కార్ రూ. 3 లక్షల ఫీజు నిర్ణయించింది. దీంతో మద్యం వ్యాపారులు లబోదిబోమంటున్నారు.