ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ దావా దాఖలు చేశారు. ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదని రెండేళ్ల తర్వాత తనని ఉద్దేశ పూర్వకంగా ఇరికించారని మాజీ ఎమ్మెల్యే సండ్ర మరో పిటిషన్ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్ లను విచారించింది జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం .తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది.