దొండా నరేష్ ఆధ్వర్యంలో పూడిక తీసివేత
NEWS Sep 26,2025 11:44 am
బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామం 13వ వార్డులో వర్షాల కారణంగా రోడ్లపై మట్టిదిబ్బలు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితిని గమనించిన TDP వడ్డాది టౌన్ అధ్యక్షుడు దొండ నరేష్ స్వయంగా ముందుకు వచ్చి, తన సొంత నిధులతో జెసిబి, ట్రాక్టర్ సహాయంతో రోడ్లను శుభ్రం చేయించారు. దీంతో వాహనాల రాకపోక సులభతరమైంది. నరేష్ చర్యపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. వానాకాలంలో కూడా రోడ్లపై సురక్షిత రాకపోక సాధ్యమైందని ప్రజలు తెలిపారు.