పెరిగిన గోదావరి నీటిమట్టం
NEWS Sep 26,2025 02:51 pm
భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 43.00 అడుగులకు చేరుకుంది . ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు . వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.