వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం
NEWS Sep 26,2025 02:52 pm
పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో 130జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి మాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐలమ్మ భూ హక్కుల కోసం చేసిన పోరాటం, రైతాంగ సాయుధ ఉద్యమంలో ఆమె పాత్ర యువతకు, మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి త్యాగాలను స్మరిస్తోందన్నారు.