సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్
NEWS Sep 26,2025 01:11 pm
సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ మూవీ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల పంట పండిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రియా అరుల్ మోహన్ , ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్బంగా తనకు ఇచ్చిన పాత్రకు మంచి పేరు రావడం పట్ల స్పందించింది శ్రియా రెడ్డి. తనను నమ్మి ఆ పాత్రకు ప్రత్యేకంగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడికి. నిర్మాత దానయ్య, హీరో పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.