స్థానిక ఎన్నికల శిక్షణ కార్యక్రమం
NEWS Sep 26,2025 01:34 pm
మెట్ పల్లి : రాబోయే స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన ప్రెసైడింగ్, సహాయ ప్రెసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం వెల్లుల్లలోని విదిత్ రెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ అధికారులు సూచించారు.