నేను కక్ష రాజకీయాలు చేయను : సీఎం
NEWS Sep 26,2025 10:57 am
ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. తనను అరెస్టు చేసి మనోవేదనకు గురి చేయాలని చూశారని అన్నారు. పవన్ కల్యాన్, బాలకృష్ణ లాంటి వారు వస్తుంటే కూడా ఆపేశారని వాపోయారు. అయితే వాటిని తాను పరిగణలోకి తీసుకోనని, కక్షా రాజకీయాలు చెయ్యనని చెప్పారు. అలా చెయ్యాలనుకుంటే అధికారంలోకి వచ్చిన తొలి రోజునే అరెస్టు చేయించి ఉండేవాడిని అని అన్నారు. తాను బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడ్ని. అందుకే ప్రజలు నాలుగో సారి కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అన్నారు.