బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముందస్తుగా ఎవరూ బయటకు రావద్దని కోరారు ట్రాఫిక్ పోలీసులు. ప్రధానంగా ఆయా సంస్థలలో పని చేసే ఉద్యోగులకు ముందు జాగ్రత్తగా ఇంటి నుండి విధులు నిర్వహించేలా (వర్క్ ఫ్రం హోమ్ ) కల్పించాలని సైబరాబాద్ సీపీ కోరారు. వర్షాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నందున ఐటీ సంస్థలు వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు.