హైదరాబాద్ లో వర్షం విమానాలు దారి మళ్లింపు
NEWS Sep 26,2025 10:07 am
హైదరాబాదులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో పలు విమానాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో శంషాబాద్ లో ల్యాండింగ్ కావాల్సిన విమానాలను దారి మళ్లించారు. గన్నవరం విమానాశ్రయానికి పలు విమానాలు దారి మళ్లించారు. విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై, పూణే , కలకత్తా నుంచి హైదరాబాదులో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్స్ చేరుకున్నాయి.