తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. తమిళనాడ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పహారం పథకంను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. విద్యార్థులకు మేలు చేకూర్చేలా సీఎం అల్పహారం పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని భరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.