ఒకే లారీ.. 2 ప్రమాదాలు జరిగినట్టు దృశ్యం
NEWS Sep 26,2025 11:17 am
మణుగూరు: విజయనగరం వద్ద ఒకే లారీ కారణంగా రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం లారీ టైరు పంచర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపై వాహనాన్ని నిలిపివేశాడు. అదే సమయంలో లారీకి సమీపంలో ఒక ఆటో ప్రమాదానికి గురవగా, మరోవైపు బైక్ లారీని ఢీకొనడంతో వేరే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష దృశ్యాలు సూచిస్తున్నాయి. ముందుగా ఆ లారీని ఆటో ఢీకొనిందా? లేక బైక్ ఢీకొనిందా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే రోడ్డుపై నిలిచిన ఒకే లారీకి సంబంధించిన రెండు వేర్వేరు ప్రమాదాలు విజయనగరం ప్రధాన రహదారిపై చోటుచేసుకోవడం స్థానికులలో చర్చనీయాంశమైంది.