ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెరుగుతోంది
NEWS Sep 26,2025 11:14 am
పినపాక: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరుగుతోందని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దుర్గాభవాని తెలిపారు. గురువారం రాత్రి ఎల్జిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పూస హరితకు నార్మల్ డెలివరీ జరిగి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని ఆమె వివరించారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యసేవలపై విశ్వాసం పెంచే క్రమంలో రాత్రివేళల్లో కూడా డాక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. గర్భధారణ దశనుంచే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సూచనల ప్రకారం జాగ్రత్తలు పాటించినట్లు బాలింతరాలి భర్త పూస సురేందర్ తెలిపారు.