జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సిరీస్‌లో 3వ భాగం ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’’ ట్రైలర్ విడుదలైంది. ‘యాష్ పీపుల్’ అనే కొత్త నవీ తెగను పరిచయం చేశారు. వీరు అగ్నిని ఆరాధించేవారుగా, భయంకరమైన సైకోపాతో ఉంటారు. వీరే పండోరాకు అతిపెద్ద ముప్పుగా మారినట్లు అర్థం అవుతోంది. అగ్ని పర్వత ప్రాంతాలు, పగలే మెరిసే లావా ప్రవాహాలు, సరి కొత్త జీవులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ‘అవతార్ 3’ డిసెంబర్ 19న విడుదల కానుంది.