అడ్ల రాంబాబుకు అక్కినేని పురస్కారం
NEWS Sep 25,2025 09:31 pm
హైదరాబాద్: GVR కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి వేడుకలు శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా జరిగాయి. పలు రంగాల్లోని ప్రముఖులకు, ప్రతిభావంతులకు అక్కినేని పురస్కారాలను ప్రదానం చేశారు. సినీ పాత్రికేయ రంగం నుంచి అడ్ల రాంబాబు (సినీవినోదం.కాం)కు కేవీ రమణా చారి అక్కినేని పురస్కారం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా అడ్ల రాంబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.