మెట్‌పల్లి–గోధూరు రహదారి గుంతలమయం
NEWS Sep 25,2025 03:17 pm
మెట్‌పల్లి పట్టణం నుండి గోధూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి సింగాపురం కెనాల్ దాటిన తర్వాత గుంతలమయంగా మారి వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రమాదకరంగా మారింది. అయితే ఈ పరిస్థితిని R&B అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.