సిఈఓ గౌతమ్ రెడ్డికి PRTU వినతి పత్రం
NEWS Sep 25,2025 03:21 pm
జగిత్యాల జిల్లా పరిషత్ ఆధీనంలో పనిచేస్తున్న దాదాపు 1600 మంది ఉపాధ్యాయుల జిపిఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్, ఫైనల్ పేమెంట్ దరఖాస్తులను జిల్లా విద్యాధికారి కార్యాలయం ద్వారా కాకుండా నేరుగా జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి గౌతమ్ రెడ్డికి PRTUTS జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బోయినిపెల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. గతంలో మాదిరిగానే GO MS No.40 ప్రకారం ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల మంజూరుతో కూడిన ప్రతిపాదనలను నేరుగా జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరించేవారని, అదే విధానాన్ని కొనసాగించాలని కోరారు.