శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు
NEWS Sep 25,2025 08:49 pm
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కేంద్రం లో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థానం యందు గురువారం హుండీ లెక్కించారు. హండీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం Rs. 7,61,764/- రూపాయలు సమకూరినట్టు EO కాంతా రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు పి.సత్యనారాయణ, కమాన్పూర్ పోలీస్ శాఖ సిబ్బంది, శ్రీ లక్ష్మీనరసింహ సేవ ట్రస్ట్ కార్యదర్శి ప్రేమలత ఆధ్వర్యంలోని సభ్యులు , భక్తులు ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.