వైర్ల కింద ఉన్న చెట్ల కొమ్మలు తొలగించిన అధికారులు
NEWS Sep 25,2025 08:50 pm
వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నామని ఏఈ వేణుగోపాల్ తెలిపారు. గురువారం పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ సుందరయ్య నగర్ లో విద్యుత్ శాఖ అధికారులు , గ్రామస్తులు కలిసి స్వచ్ఛందంగా చెట్ల కొమ్మలను తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ అంతరాయం లేకుండా ఉండేందుకు చేస్తున్న కష్టాన్ని గ్రామస్తులు అభినందించారు.