పోస్టల్ శాఖ పథకాలను ప్రచారం చేయాలి
NEWS Sep 25,2025 03:24 pm
పోస్టల్ శాఖ అందించే పథకాలను గ్రామాల్లోకి తీసుకొని వెళ్లాలని అది ప్రతి ఉద్యోగి బాధ్యత అని పోస్టల్ శాఖ ఐపీఓ రామ్మూర్తి తెలిపారు. పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం, పినపాక మండలాలకు చెందిన పోస్టల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. పోస్టల్ శాఖలో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా బ్యాంకు సేవలన్నీ పొందవచ్చు అని తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఈ అకౌంట్ ఉపయోగ పడుతుందని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పోస్టల్ శాఖ కార్యాలయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.