లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే: జేఏసీ చైర్మన్ రామకృష్ణ
NEWS Sep 25,2025 08:54 pm
లంబాడీ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసి సంఘాల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో ఆదివాసి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదిన భద్రాచలం లో నిర్వహించే ఆదివాసీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమరం అశోక్, శ్రీను, కుంజా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.