ప్రభుత్వం జామాయిల్ కటింగ్ చేపట్టాలి: సిపిఎం
NEWS Sep 25,2025 03:25 pm
ప్రభుత్వం, అటవీ అధికారులు అమలు చేస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మండిపడ్డారు. ములకలపల్లి మండలం రామారం గ్రామంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ గ్రామంలో జామాయిల్ తోటను ఎంతో కాలంగా నరక పోవడం వల్ల ఇక్కడ రైతులు ఉపాధిని కోల్పోతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గత 30 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్న టిడిపి ప్రభుత్వం అటవీ భూముల రక్షణకు ఈఎస్ఎస్ లను ఏర్పాటు చేసిందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం స్థానిక గిరిజనులను, గిరిజనేతరులను భాగస్వాములుగా చేస్తూ జామాయిల్, సుబాబుల్, వెదురు మొక్కలు నాటిందని తెలిపారు.