తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. కాగా టెండర్ ఫీజు రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. దీనిపై మద్యం దుకాణాదారులు లబోదిబోమంటున్నారు.