రామయ్యను దర్శించుకున్న సిఆర్పిఎఫ్ ఐజి విపుల్ కుమార్
NEWS Sep 25,2025 03:00 pm
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ను కర్ణాటక సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఐజి జనరల్ విపుల్ కుమార్ సందర్శించారు. గురువారం ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ ఈవో దామోదర్ స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. రామయ్య దర్శనం అనంతరం , ఆలయ ప్రాంగణంలో గల ఇతర దేవాలయాలను సందర్శించారు. లక్ష్మీ తాయారు అమ్మ వారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామయ్య విశిష్టతను ఆయనకు ఆలయ అర్చకులు వివరించారు.