అమ్మవారు నవరాత్రుల సందర్భంగా గజలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. గురువారం భద్రాచలంలో సీతమ్మ అమ్మవారు రెండు ఏనుగులతో కూడిన సుందరమైన అమరికలో కనిపించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు మాట్లాడుతూ గజలక్ష్మి దర్శనం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్నారు.భక్తులు ప్రతి ఏటా కంటే ఈ ఏడాది భారీగా వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.