మణుగూరులో ప్రధాన రహదారికి సరైన మార్జిన్ లేకపోవడంతో లారీని తిప్పే క్రమంలో అదుపుతప్పి లారీ పొదల్లోకి తీసుకుని వెళ్ళింది. గురువారం మధ్యాహ్నం మణుగూరు అటవీ కార్యాలయం సమీపంలో టర్నింగ్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ కు అడ్డుగా లారీ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాకాలం కావడంతో రోడ్డు మార్జిన్ దిగితే లారీలు దిగిపోతున్నాయని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.