ATC సెంటర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS Sep 25,2025 02:40 pm
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ATC సెంటర్‌ల నేపథ్యంలో, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ATC సెంటర్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ATC సెంటర్ రామగుండం ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని, మరిన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.