ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి
NEWS Sep 25,2025 02:39 pm
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని గోలివాడ గ్రామంలో గురువారం బీజేపీ నేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 109వ జయంతిని పురస్కరించుకుని “అమ్మ పేరుతో చెట్టు” కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ్ అంత్యోదయ తత్వాన్ని స్మరించుకుంటూ, ప్రజాసేవే ధ్యేయంగా కార్యకర్తలు నడవాలని పిలుపునిచ్చారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.